తెలంగాణ ఉద్యమకారులకు గుడ్ న్యూస్.. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం

by GSrikanth |   ( Updated:2023-11-16 14:25:54.0  )
తెలంగాణ ఉద్యమకారులకు గుడ్ న్యూస్.. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఉద్యమకారుల కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ శుభవార్త చెప్పింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉద్యమకారులపై పెట్టిన కేసులను ఎత్తివేస్తామని హామీ ఇచ్చింది. అంతేకాదు.. ఉద్యమకారుల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని తాజా మేనిఫెస్టోలో పేర్కొంది. కుటుంబానికి 250 గజాల ఇంటి స్థలం కూడా కేటాయిస్తామని భరోసా ఇచ్చింది. రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల వరకు రుణమాఫీ, రూ.3 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, అన్ని ప్రధాన పంటలకు సమగ్ర బీమా పథకం అమలు, దాదాపు రెండు లక్షల వరకు ఉద్యోగాల భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు

Read More..

కాంగ్రెస్ పూర్తి నిరాశలో ఉంది : Mayawati

Advertisement

Next Story