ఎమ్మెల్సీ కవిత ట్వీట్‌కు టీ.కాంగ్రెస్ కౌంటర్

by GSrikanth |   ( Updated:2023-11-24 11:29:26.0  )
ఎమ్మెల్సీ కవిత ట్వీట్‌కు టీ.కాంగ్రెస్ కౌంటర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు టీకాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. ‘ఎన్నికల్లో ఓటర్లు ఆగం కావొద్దని ఆలోచించి ఓటు వేయాలని.. బీఆర్ఎస్ అభివృద్ధి కావాలా? కాంగ్రెస్ అరాచకం కావాలా?' అంటూ కవిత శుక్రవారం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా చేసిన పోస్టు చేసింది. ఈ పోస్టుపై టీకాంగ్రెస్ రియాక్ట్ అయింది. ఇన్నాళ్లు బీఆర్ఎస్ అరాచకాలకు చరమగీతం పాడటానికే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టబోతున్నారని కౌంటర్ ఇచ్చింది. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్రరావు, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యలు మన తెలంగాణ ఆడబిడ్డల మీద చేసినవి అరాచకాలు కావా? కవిత గారు అంటూ నిలదీసింది.

Advertisement

Next Story