- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెన్షనర్లకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్
దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం కామారెడ్డిలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కామారెడ్డితో తనకు పుట్టుక నుంచే అనుబంధం ఉందని చెప్పారు. తన తల్లి పుట్టింది కామారెడ్డిలోనేనని, చిన్ననాడు తాను ఇక్కడే పెరిగానని అన్నారు. ఈ ప్రాంతంలో బీడీ కార్మికులు ఎక్కువగా ఉంటారని అన్నారు. ఈ సందర్భంగా బీడీ కార్మికులకు శుభవార్త చెప్పారు. బీడీ కార్మికులకు పెన్షన్ కూడా పెంచుతామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఇండియాలో మొత్తం 16 రాష్ట్రాల్లో బీడీ కార్మికులు ఉన్నా.. తెలంగాణలో తప్పా ఎక్కడా పెన్షన్ ఇవ్వడం లేదని గుర్తుచేశారు. కటాఫ్ డేట్ 2014 వరకు పెట్టడంతో కొత్త వారికి పెన్షన్ రావట్లేదని కొంతమంది ఆందోళన చేస్తున్నారు. కొత్త బీడీ కార్మికులకు లక్ష మంది ఉంటారు కావొచ్చు. అధికారంలోకి రాగానే వారందరికీ బీడీ పెన్షన్ మంజూరు చేస్తాం. పెన్షన్‌ను రూ.5 వేలకు పెంచుతామని సీఎం భరోసా ఇచ్చారు.