- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పోలీసులను కంటికి రెప్పలా కాపాడుకుంటాం.. RSP హామీ
దిశ, డైనమిక్ బ్యూరో: గొడ్డు చాకిరీ చేస్తున్న పోలీసులు, హోంగార్డుల మీద ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కనికరం కలగడం లేదని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. ఇప్పటి వరకు తెలంగాణలో పోలీసులకు, ఇతర ఉద్యోగులకు ఇంకా జీతాలు రాలేదని ఆరోపించారు. పీఆర్సీ అరియర్లు కేవలం రెండే ఇచ్చారన్నారు. మూడు సరెండర్ లీవులు ఇంకా పెండింగులో ఉన్నాయన్నారు. లోన్లు తీసుకున్న వాళ్లు ఈఎంఐలు కట్టలేక సిబిల్ రేటింగులు పడిపోతున్నాయన్నారు. పిల్లల ఫీజులు సకాలంలో కట్టనందుకు స్కూళ్ల యాజమాన్యాలు పిల్లలను అవమానిస్తూ పుస్తకాలివ్వకుండా వెనక్కు పంపిస్తున్నారని, ఇంకా ఇళ్ల కిరాయి గురించి అయితే చెప్పనక్కరలేదన్నారు. ఆరోగ్య భద్రత అనారోగ్యంతో మంచాన పడ్డదని వివరించారు.
సీఎం అసత్యాల-భ్రమల సభలన్నింటికీ బలవంతంగా బందోబస్తు వేసి, తమ లాంటి ప్రతిపక్ష పార్టీల నాయకులందరినీ అక్రమంగా రాత్రికి రాత్రే అరెస్టు చేయిస్తున్నారని విమర్శించారు. ఫాం హౌసుల లాంటి ప్రైవేటు ఆస్తులకు కూడా బలవంతంగా వందల మంది పోలీసు కమాండోలను బందోబస్తుకు అక్రమంగా వినియోగిస్తున్నారని ఆరోపించారు. ఈ బందోబస్తుల టీఏలు ఏవీ ఇంతవరకు రావడం లేదన్నారు. ‘ఇందుకోసమేనా కానిస్టేబుల్ కిష్టయ్య ముదిరాజ్ త్యాగం చేసింది? మన సకల జనుల సమ్మెలు ఇలాంటి హృదయం లేని పాలకుల కోసమే చేసినమా? ఎక్కడ పోయిండ్రు పాలాభిషేక యూనియన్ సోదరులు? పాలకులు ఎమ్మెల్సీ పదవుల ఆశ చూపి మీ నోళ్లు కట్టేశారా??’ అని ప్రశ్నించారు. పోలీసన్నలారా, ఉద్యోగ మిత్రులారా, మన బహుజనరాజ్యంలో మిమ్ముల కంటికి రెప్పలా కాపాడుకుంటామని ఆర్ఎస్పీ హామీ ఇచ్చారు.