- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కేటీఆర్ క్లాస్‌మేట్‌కు BRS టికెట్.. ఆ నియోజకవర్గం నుండి పోటీకి అవకాశం
దిశ, తెలంగాణ బ్యూరో: Khanapur, Telangana Assembly constituencyటికెట్‌ను కేటీఆర్ తన క్లాస్ మేట్‌కు ఇప్పించుకున్నారు. భూక్యా జాన్సన్ రాథోడ్ నాయక్ కేటీఆర్‌తో కలిసి చదువుకున్నారు. అయితే గత కొంతకాలంగా జాన్సన్ పేరు తెరమీదకు వచ్చింది. ఓ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. జాన్సన్ నేను చిన్నప్పటి నుంచి స్నేహితులమని, ఒకరిపై ఒకరం ఎంతో నమ్మకంగా ఉంటామని, తనకు సమస్య వచ్చినప్పుడు నేను, నాకు సమస్య వచ్చినప్పుడు జాన్సన్ అన్నివిధాలుగా సహకరించేవాడన్నారు.
జాన్సన్‌కు సంబంధించిన ఓ రికమెండేషన్ విషయంలో కులం గురించి తెలుసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే, అప్పటివరకు నాకు జాన్సన్ ఏ కులానికి చెందినవాడో తెలియదంటే మా ఇద్దరి మధ్య స్నేహం ఎంత బలమైనదో తెలుసుకోవచ్చు అన్నారు. ఆతర్వాత రికమెండేషన్ కోసమే నేను జాన్సన్‌ను కులమడిగి పనిచేసి పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందంటూ మంత్రి.. జాన్సన్ నాయక్‌తో తనకున్న స్నేహ బంధాన్ని వివరించారు.
అయితే, ఆ సానిహిత్యంతో, నియోజకవర్గ ప్రజల్లో సైతం పాజిటీవ్‌గా ఉండటంతో స్నేహితుడికి వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇప్పించుకున్నట్లు స్పష్టమవుతోంది. ఈ ఒక్క టికెట్‌తో కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో కేటీఆర్ మార్క్ ఉన్నదని, అనుచరులకే ఎక్కువమందికి టికెట్ ఇప్పించుకున్నారనేది స్పష్టమవుతోంది.