- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అలా చేస్తే తెలంగాణలో బీజేపీ పతనం ఖాయం.. సొంత నేత సంచలన వ్యాఖ్యలు
దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీలో అసంతృప్తుల పర్వం కొనసాగుతోంది. బీజేపీలో చేరిన ఉద్యమకారులంతా అసంతృప్తిలో ఉన్నారు. మొన్న మాజీ మంత్రి ఏ.చంద్రశేఖర్.. నిన్న రవీంద్రనాయక్.. నేడు జిట్టా బాలకృష్ణారెడ్డి అసంతృప్తితో ఉన్నారు. చంద్రశేఖర్, రవీంద్ర నాయక్ కాస్త తగ్గినా పూర్తి స్థాయి సంతృప్తిగా కూడా లేరు. కాగా, ఇప్పుడు అసంతృప్తిగా ఉన్నవారి జాబితాలోకి జిట్టా బాలకృష్ణారెడ్డి చేరారు. రాష్ట్రంలో బీఆర్ఎస్‌కు మేలు చేసేలా బీజేపీ వ్యవహారం ఉందని ఆయన విమర్శలు చేసినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్‌తో ఫ్రెండ్ పిష్‌పై ప్రజలకు క్లారిటీ ఇవ్వకుంటే బీజేపీ పతనం ఖాయమని అన్నట్లుగా సమాచారం.
ఎంపీ సీట్లే బీజేపీకి ముఖ్యమని, అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ హైకమాండ్ లైట్ తీసుకుంటోందని ఆయన అనుమానం వ్యక్తం చేసినట్లు టాక్. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నప్పటికీ.. ఎందుకు సన్నద్ధం కావటం లేదని జిట్టా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వినికిడి. రాష్ట్ర పార్టీకి నూతన నాయకత్వం వచ్చినప్పటికీ క్యాడర్‌లో నమ్మకం కుదరటం లేదని ఆయన వాపోయినట్లు సమాచారం. జిల్లాల్లో బీజేపీ నాయకులు పనిచేసుకొనే వాతావరణం పార్టీలో లేదన్నట్లుగా తెలుస్తోంది. ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే జిట్టా తెలంగాణ బీజేపీని వీడే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన వెంటే మరికొందరు వెళ్తారని ప్రచారం జరుగుతోంది.