- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
స్టేట్‌పై బీజేపీ హైకమాండ్ ఫోకస్.. ఢిల్లీకి ఈటల, రాజగోపాల్ రెడ్డి!
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాజకీయాలపై బీజేపీ హైకమాండ్ దృష్టి సారించింది. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై అధిష్టానంతో చర్చించేందుకు ఇవాళ సాయంత్రం ఈటల రాజందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు(జూన్ 24) కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ నడ్డాతో వీరు భేటీ కానున్నారు. కొత్త బాధ్యతల అప్పగింతపై కూడా వీరితో హైకమాండ్ కీలకంగా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా, తెలంగాణపై పట్టు సాధించేందుకు బీజేపీ జాతీయ నాయకత్వం ‘ఇంటింటికీ బీజేపీ’ అనే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తెలంగాణ వ్యాప్తంగా 35 లక్షల కుటుంబాలను కలిసి ప్రజలకు చేరువ కావాలని ఈ నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో పార్టీ డీలా పడిన తరుణంలో ఈ యాక్టివిటీ మైలేజ్ ఇస్తుందని హైకమాండ్ భావించింది. కానీ కొందరు నేతలు తమకేం పట్టదన్నట్టుగా వ్యవహరించారు.. ముఖ్యంగా హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం పాల్గొనలేదు. వాస్తవానికి ఇరువురు నేతలు యోగా దినోత్సవం రోజున కూడా పాల్గొనకపోవడం గమనార్హం. అయితే ఇరువురు నేతలు కొద్దిరోజులుగా అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే యాక్టివిటీకి దూరంగా ఉన్నట్లు సమాచారం. దీంతో వెంటనే అప్రమత్తమైన అధిష్టానం వారిని ఢిల్లీకి పిలిచినట్లు సమాచారం.
Also Read..