- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TS: వారం రోజుల్లో పోలింగ్.. ఆలోచింపజేస్తున్న ‘బలగం’ సింగర్ పాట (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం దాదాపు తుది దశకు చేరుకుంది. ప్రధాన పార్టీలు సర్వ శక్తులన్నీ ఒడ్డి ప్రజలను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటివరకు అభ్యర్థులు చేయాల్సింది మొత్తం చేశారు. మరో రెండు, మూడు రోజుల్లో ప్రచార పర్వం కూడా ముగుస్తుంది. ఇక అంతా ఓటర్ల చేతిలో ఉంది. ప్రభుత్వాన్ని కూల్చాలన్నా, కొత్త వారికి అవకాశం ఇవ్వాలన్న ఓటర్లతోనే సాధ్యం. మరి వారు ఈసారి ఎవరికి అవకాశం ఇవ్వబోతున్నారో సరిగ్గా పది రోజుల్లో తేలనుంది. ఈ క్రమంలో ప్రముఖ సింగర్, బలగం ఫేమ్ రామ్ మిరియాల ఓ ఆసక్తికర పాట పాడి వినిపించారు.
ఎన్నికలే లక్ష్యంగా ఓటర్లను ప్రభావితం చేసేలా సాంగ్‌ను రూపొందించారు. ‘ఓటరన్నా.. ఈసారి నీ ఓటు రేటెంతా?, నీ లీడర్ ఇచ్చే చీప్ లిక్కర్ అంతనా? అభ్యర్థులు బిచ్చమేసే రెండు వేల నోటంతా? నీ కులపోడైతే వాడికి డిస్కౌంటా? ఏంది ఇంతేనా ఇక నీ బతుకంతా? నీ రేటు పెంచు కొంతా, లైఫ్ సెట్ అయిపోయేలాగా రేట్ పెంచు’ అంటూ రామ్ మిరియాల పాడిన పాట యూట్యూబ్‌ను, సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మరి ఈ పాట ఓటర్లను ఎంతమేర ప్రభావితం చేస్తుందో చూడాలి.