బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రచారంలో అపశృతి

by GSrikanth |
బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రచారంలో అపశృతి
X

దిశ, వర్ధన్నపేట: బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ ప్రచారంలో అపశృతి చోటుచేసుకుంది. ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా మండపం కూలి మహిళకు గాయాలు అయ్యాయి. ఈ ఘటన శుక్రవారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ వర్ధన్నపేట మండలం నల్లబెల్లి గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కూడలిలో మండపం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో అనూహ్యంగా మండపం కూలింది. దీంతో అందరు భయంతో పరుగులు తీశారు. ఒక మహిళకు మాత్రం స్వల్పంగా గాయాలు అయ్యాయి. ఆర్మూరు నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్‌కు ప్రమాదం జరిగిన మరుసటిరోజే మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రచారంలో అపశృతి చోటుచేసుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా చర్చ సాగుతోంది.

Advertisement

Next Story