63 మందితో తెలంగాణ టీడీపీ అభ్యర్థుల జాబితా సిద్ధం!

by GSrikanth |
63 మందితో తెలంగాణ టీడీపీ అభ్యర్థుల జాబితా సిద్ధం!
X

దిశ, తెలంగాణ బ్యూరో: టీడీపీ రాష్ట్రంలోని 63 నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులతో జాబితాను సిద్ధం చేసింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సిగ్నల్ కోసం వెయిటింగ్ చేస్తున్నారు. శుక్రవారం బాబుకు బెయిల్ వచ్చే అవకాశం ఉందని, రాగానే వెళ్లి జాబితాను ఆమోదించాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ కోరనున్నారు. గతంలో 30మంది పోటీచేసే అభ్యర్థులతో అధినేత మాట్లాడారు. మిగిలిన సీట్ల భర్తీపై కసరత్తు ప్రారంభించినట్లు తెలిసింది. త్వరలోనే ఆసీట్లపై పోటీచేసే అభ్యర్థులు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.

Advertisement

Next Story