ఎలక్షన్ కోడ్ ఎఫెక్ట్: రూ.519 కోట్లకు చేరుకున్న పట్టుబడ్డ నగదు!

by GSrikanth |
ఎలక్షన్ కోడ్ ఎఫెక్ట్: రూ.519 కోట్లకు చేరుకున్న పట్టుబడ్డ నగదు!
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: రాష్ర్టవ్యాప్తంగా జరుపుతున్న తనిఖీల్లో పట్టుబడ్డ నగదు, సొత్తు విలువ రూ.519 కోట్లకు చేరుకుంది. దీంట్లో ఎన్నికల కోడ్​అమల్లోకి వచ్చిన అక్టోబర్​9వ తేదీ నుంచి మంగళవారం ఉదయం 9గంటల వరకు స్వాధీనం చేసుకున్న నగదు 177.32 కోట్ల రూపాయలు ఉంది. ఇక, ఇప్పటివరకు అధికారులు వేర్వేరు చోట్ల రూ.66.45 కోట్ల విలువ చేసే మద్యాన్ని సీజ్​చేశారు. దాంతోపాటు రూ.30.71కోట్ల విలువ చేసే మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. రూ.178 కోట్ల విలువ చేసే బంగారం, వెండి, వజ్రాలు, ప్లాటినం సీజ్​చేశారు. రూ.66.10 కోట్ల విలువ చేసే బియ్యం, కుక్కర్లు, కుట్టు మిషన్లు, చీరలు, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

24 గంటల్లో...

సోమవారం ఉదయం 9గంటల నుంచి మంగళవారం ఉదయం 9గంటల మధ్య రాష్ర్టంలోని వేర్వేరు ప్రాంతాల్లో అధికారులు రూ.3.21కోట్ల నగదును పట్టుకున్నారు. దాంతోపాటు రూ.3.52 కోట్ల విలువ చేసే 2,501 లీటర్ల మద్యం, 280 కిలోల అలుం, 1,570 కిలోల నల్లబెల్లం స్వాధీనం చేసుకున్నారు. ఇక, కోటీ 76 లక్షల రూపాయల విలువ చేసే 109 కిలోల గంజాయి, 74.58 కిలోల ఇతర మాదకద్రవ్యాలను సీజ్​చేశారు. దాంతోపాటు రూ.20.91కోట్ల విలువ చేసే 0.154 కిలోల బంగారం, 1.275 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు. రూ.11.57 కోట్ల విలువ చేసే మొబైల్​ఫోన్లు, స్పీకర్లు, టీ షర్టులు, ఇతర పరికరాలను సీజ్ చేశారు.

Advertisement

Next Story