గద్దర్ కూతురు వెన్నెలకు కాంగ్రెస్ టికెట్ ఖరారు.. నియోజకవర్గం ఇదే!

by GSrikanth |
గద్దర్ కూతురు వెన్నెలకు కాంగ్రెస్ టికెట్ ఖరారు.. నియోజకవర్గం ఇదే!
X

దిశ, కంటోన్మెంట్: ప్రజా గాయకుడు గద్దర్ ఫ్యామిలీలో ఒకరికి టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గద్దర్ కుమార్తె వెన్నెలను సికింద్రాబాద్ కంటోన్మెంట్ (రిజర్వుడు) స్థానం నుంచి బరిలో నిలబెట్టాలనుకుంది. ఆక్టోబర్ సెకండ్ వీక్‌లో ఎఐసీసీ వెలువరించనున్న జాబితాలోనే ఆమె పేరును ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏఐసీసీ తీసుకున్న నిర్ణయాన్ని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి స్వయంగా గద్దర్ నివాసానికి వెళ్లి వెన్నెలకు తెలియజేసినట్లు సమాచారం. గద్దర్ భార్య విమల, కుమారుడు సూర్యంతో ఈ విషయాన్ని చర్చించినట్లు తెలిసింది.

గద్దర్‌కు అండగా కాంగ్రెస్

గద్దర్‌కు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటూ వస్తోంది. ఆనారోగ్యంతో ఆసుపత్రిలో గద్దర్ చికిత్స పొందుతున్న సమయంలోనూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అండగా నిలిచారు. గద్దర్ మృతి తర్వాత, అంత్యక్రియల సమయంలో కూడా కాంగ్రెస్ తరఫున సహాయం అందించారు. ఈ క్రమంలోనే గద్దర్ కుటుంబ సభ్యులకు కూడా అండగా నిలువాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయానికి వచ్చింది. అయితే వచ్చే అసెంబ్లీ బరిలో గద్దర్ కుటుంబం నుంచి ఒకరిని ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని కాంగ్రెస్ స్కెచ్ వేసింది. గద్దర్ ఫ్యామిలీలో టికెట్ ఎవరికి ఇవ్వాలనేదానిపై రాష్ట్ర స్థాయి నేతలు ఇటీవల రహస్యంగా చర్చించుకున్నట్లు సమాచారం. కుమారుడు సూర్యానికి టికెట్ ఇవ్వడం కంటే కుమార్తె వెన్నెలకు ఇవ్వడమే మంచిదని అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. ఇదే విషయాన్ని ఏఐసీసీకి కూడా తెలియజేయడంతో చివరకు ఆమె పేరునే ఖరారు చేద్దామంటూ స్టేట్ లీడర్లకు సంకేతాలు అందాయని పార్టీ వర్గాలు తెలియజేస్తున్నారు. గద్దర్ తరహాలోనే ఉపన్యాసాలు ఇవ్వడంతోపాటు వెన్నెల పాటలు పాడుతుందని రాష్ట్ర స్థాయి నాయకులు అభిప్రాయం తెలిపారు. కంటోన్మెంట్ నుంచి బరిలో దింపాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story