‘అదంతా ఫేక్ న్యూస్.. కాసాని బీఆర్ఎస్‌లోకి పోవట్లేదు’

by GSrikanth |
‘అదంతా ఫేక్ న్యూస్.. కాసాని బీఆర్ఎస్‌లోకి పోవట్లేదు’
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ పార్టీ మారుతున్నట్లు, అతి త్వరలో బీఆర్ఎస్ చేరబోతున్నట్లు వార్తలు విస్తృతమయ్యాయి. అంతేకాదు.. ఈ ఎన్నికల్లో పార్టీ పోటీలో కూడా ఉండటం లేదని వార్తలు ప్రచురించారు. దీంతో ఈ వార్తలపై టీడీపీ జాతీయ కార్యదర్శి కాసాని వీరేశం స్పందించారు. అవన్నీ తప్పుడు కథనాలు అని కొట్టిపారేశారు. ఈ మేరకు గురువారం మీడియా ప్రకటన విడుదల చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ వార్తలు ఉన్నాయని మానుకోవాలని సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని, ఇప్పటికే అభ్యర్థుల లిస్టును సైతం రెడీ చేశామని, చంద్రబాబు ఆమోదం ఒకటి రెండ్రోజుల్లో వస్తుందన్నారు.

Advertisement

Next Story