నేడు హైదరాబాద్‌కు అన్నామలై.. ఆ నియోజకవర్గంలో ప్రచారం

by GSrikanth |
నేడు హైదరాబాద్‌కు అన్నామలై.. ఆ నియోజకవర్గంలో ప్రచారం
X

దిశ, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై నేడు రాష్ట్రంలో పర్యటించనున్నారు. మంగళవారం ఉదయం 9:30 గంటలకు నిర్మలా సీతారామన్ జూబ్లీహిల్స్ సెగ్మెంట్ పరిధిలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అనంతరం మధ్యామ్నం 12 గంటలకు నేరెడ్ మెట్ వాయుపురి రీక్రియేషన్ సెంటర్‌లో మీట్ అండ్ గ్రీట్‌కు హాజరుకానున్నారు. ఉదయం 11 గంటలకు ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని దోమలగూడ ఏవీ కాలేజీ నుంచి నిర్వహించే బైక్ ర్యాలీని దేవేంద్ర ఫడ్నవీస్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ కూడా పాల్గొంటారు. శేరిలింగంపల్లిలో ఉదయం 10.45కి తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ప్రచారంలో పాల్గొంటారు. అలాగే సాయంత్రం 5 గంటలకు కంటోన్మెంట్‌లో ప్రచారం చేయనున్నారు.

Advertisement

Next Story