ఢిల్లీ లిక్కర్ కుంభకోణం: CPI నారాయణ సంచలన వ్యాఖ్యలు

by GSrikanth |
ఢిల్లీ లిక్కర్ కుంభకోణం: CPI నారాయణ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: లిక్కర్ కేసులో జైల్లో ఉండాల్సిన వాళ్ళు బయట ఉన్నారని, బయట ఉండాల్సిన వారు జైల్లో ఉన్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. లిక్కర్ స్కాం వ్యవహారంలో ఆమ్ ఆద్మీ నేత మనీష్ సిసోడియాపై రాజకీయ కక్ష సాధిస్తున్నారని మండిపడ్డారు. లిక్కర్ స్కాంలో వైసీపీ, బీఆర్ఎస్ ప్రముఖులు ఉన్నారని ఆరోపించారు. ప్రస్తుతం బీఆర్ఎస్, వైసీపీ, బీఆర్ఎస్ వారంత కుమ్మక్కయ్యారని, కేవలం ఒక్క ఆమ్ ఆద్మీ పార్టీపైనే చర్యలు తీసుకున్నారని ఆరోపించారు. అందుకే మనీష్ సిసోడియాకు బెయిల్ రాకుండా చేశారని, ఇంకో ఎంపీని అరెస్టు చేశారని మండిపడ్డారు.

బీజేపీకి సపోర్ట్ చేయనందుకే ఆమ్ ఆద్మీ పార్టీపై కేసులు అని నారాయణ విమర్శించారు. దేశంలో ఒకే పాదం ఉందని, అది ఢిల్లీ ఆజ్ఞ లేనిదే ఎవరికి బెయిల్ రాదు.. ఢిల్లీ అజ్ఞ లేనిదే ఎవరిని అరెస్టు చేయలేమని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బీజేపీకి అనుకూలంగా ఉన్నా కూడా బెదరగొట్టి లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీకి శత్రువులు ఉండకుడదనే ప్రయత్నం చేస్తున్నారని, ఇండియా కూటమిని చూసి భయపడుతున్నారని అన్నారు.

కాంగ్రెస్ సీట్లు ఇవ్వమని చెప్పలేదు..

కాంగ్రెస్‌తో పొత్తుపై సీపీఎంతో చర్చలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. తమకు సీట్లు ఇవ్వమని కాంగ్రెస్ చెప్పలేదని అన్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి సరికాదని, దీన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఈ ఘటన విషయాన్ని పోలీసులకు వదిలివేయాలన్నారు. వివిధ పార్టీలు చేయించాయనే ఆరోపణలతో వాస్తవాన్ని బయటకు రాకుండా ఉండే ప్రమాదం ఉందని, లేదంటే ప్రభాకర్‌కు న్యాయం జరగదని అభిప్రాయపడ్డారు. వెంటనే ఈ కేసును తేల్చాలని కోరారు. దేశంలో ఉల్లి బ్లాక్ మార్కెట్ నడుస్తోందని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed