- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అది తెలంగాణ ప్రజల అదృష్టం.. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
దిశ, తెలంగాణ బ్యూరో: తొమ్మిదేళ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రం విధ్వంసానికికు గురైందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. ఆదివారం ఆయన తుక్కుగూడ విజయభేరీ సభలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలతోనే బంగారు భవిష్యత్‌కు పునాది పడుతుందన్నారు. కాంగ్రెస్‌కు అండగా నిలబడాల్సిన అవసరం ఉన్నదన్నారు. ప్రజల కష్టాలు, ఆకాంక్షలు నెరవేర్చేందుకు సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారన్నారు. 2004లో ఇచ్చిన మాట ప్రకారం సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వడం ప్రజల అదృష్టమన్నారు. కానీ, వచ్చిన తెలంగాణలో రైతులు, యువత ఇలా ప్రతి ఒక్కరిని కేసీఆర్ మోసం చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. విజయభేరి సభలో విడుదల చేసిన గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వెంటనే అమలు చేస్తామన్నారు.
కేసీఆర్ పాలనలో రాష్ట్రంలోని మైనార్టీలు, పేదలకు కష్టాలను తీర్చడానికి సోనియా గాంధీ మళ్లీ ఈ గడ్డపై కాలు మోపారన్నారు. సోనియా రాకతో తెలంగాణ నేల పులకరించిందన్నారు. విజయభేరి సభ నిర్వహించకుండా బీఆర్ఎస్, బీజేపీ కుట్రలు పన్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. విజయభేరి సభ జరగకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శతవిధాల ప్రయత్నించాయని మండిపడ్డారు. సభ కోసం పరేడ్ గ్రౌండ్‌కు అనుమతి అడిగితే కేంద్ర ప్రభుత్వం నిరాకరించిందన్నారు. గచ్చిబౌలి స్టేడియం అడిగితే రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించగా.. తుక్కుగూడలో ఏర్పాటు చేస్తే.. దేవదాయ భూమి అంటూ రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేసిందన్నారు. కానీ, తుక్కుగూడ రైతులు ముందుకొచ్చి ఈ సభకు భూమి ఇచ్చారన్నారు. విజయవంతం చేసిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.