అసద్, అక్బరుద్దీన్‌లపై రేవంత్ రెడ్డి సీరియస్

by GSrikanth |
అసద్, అక్బరుద్దీన్‌లపై రేవంత్ రెడ్డి సీరియస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ, బీఆర్ఎస్‌పై విమర్శలు చేస్తుంటే అక్బరుద్దీన్, అసదుద్దీన్‌లు ఎందుకు అసహనం వ్యక్తం చేస్తున్నారో అర్థం కావట్లేదని రేవంత్ పేర్కొన్నారు. వాళ్లు ఎవరిపక్షాన నిలబడ్డారో, ఎవరికి మద్దతుగా నిలుస్తారో తేల్చుకోవాలన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. 2018లోనూ బీజేపీ ఇలాంటి కుట్రలే చేసి, 105 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయిందని గుర్తుచేశారు. బీజేపీ, బీఆర్ఎస్ ఫెవికాల్ బంధం ప్రజలకు అర్థమైందని, ఈ రెండు పార్టీల కుట్రలను తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతీ తెలంగాణ బిడ్డపై ఉందన్నారు. ప్రతీ ఒక్కరూ ముందుకు వచ్చి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు.

Advertisement

Next Story