నేడే రాష్ట్రానికి ప్రధాని మోడీ.. పూర్తి షెడ్యూల్ ఇదే!

by GSrikanth |
నేడే రాష్ట్రానికి ప్రధాని మోడీ.. పూర్తి షెడ్యూల్ ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇవాళ తెలంగాణలోని పాలమూరులో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి ప్రధాని మోడీ చేరుకుంటారు. ఎయిర్‌పోర్టులో ప్రధానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలకనున్నారు. అనంతరం 1:35 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్‌లో మహబూబ్‌ నగర్‌ వెళ్తారు. మధ్యాహ్నం 02:05 గంటలకు మహబూబ్‌నగర్ చేరుకొని.. ప్రజా గర్జన సభలో పాల్గొంటారు. సభలో ప్రసంగం ముగియగానే సాయంత్రం 04:45 గంటలకు తిరిగి ఢిల్లీకి బయల్దేరనున్నారు. అక్టోబర్ 3వ తేదీన రాష్ట్రంలో మోడీ మరోసారి పర్యటించనున్నారు. నిజామాబాద్‌లో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొనన్నారు.

Advertisement

Next Story

Most Viewed