- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TS Election: తెలంగాణ ఓటర్లకు ప్రధాని మోడీ కీలక పిలుపు
దిశ, వెబ్‌డెస్క్: పోలింగ్ వేళ తెలంగాణ ఓటర్లకు ప్రధాని మోడీ కీలక పిలుపునిచ్చారు. రికార్డు స్థాయిలో ఓటు వేసి ప్రజాస్వామ్య పండుగను బలోపేతం చేయాలని కోరారు. ముఖ్యంగా యువత ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. కాగా, రాష్ట్రంలో ఏపార్టీ అధికారంలోకి రావాలనేది విషయంపై ఓటర్లు నేడు తీర్పు ఇవ్వనున్నారు. తెలంగాణలో దాదాపు పదేండ్ల ప్రగతి ప్రస్థానాన్ని, పాలనను చూసి మరోసారి ఆశీర్వదించాలని బీఆర్ఎస్ కోరుతున్నది.
మరో వైపు ‘మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి..’ అనే నినాదంతో కాంగ్రెస్ ప్రచారం చేసింది. దొరల తెలంగాణ స్థానంలో ప్రజల తెలంగాణ పరిపాలన కోసం తమను ఆదరించాలని ఓటర్లకు అప్పీల్ చేసింది. ఇంకో వైపు బీసీ ముఖ్యమంత్రి నినాదాన్ని తెరపైకి తెచ్చిన బీజేపీ.. రాష్ట్రంలో కుటుంబ, అవినీతి పాలన సాగిస్తున్న కేసీఆర్ ఫ్యామిలీని ఇంటికి సాగనంపాలని పిలుపునిచ్చింది. మరి ఓటర్లు ఎటు వైపు మొగ్గుచూపుతారు? ఏ పార్టీని ఆదరిస్తారు? అనేది కీలకంగా మారింది.