- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఈవీఎంపై ఎన్నికల సింబల్, అభ్యర్థుల ఫోటో!
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు. ఈవీఎం మిషన్లలో ఎన్నికల సింబల్‌తో పాటు అభ్యర్థి ఫోటోను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో ఇవాళ మీడియాతో మాట్లాడిన వికాస్ రాజ్.. ఎన్నిక అక్రమాలపై సీ విజిల్ యాప్‌తో పాటు 1950 టోల్ ప్రీ నెంబర్‌కు కాల్ చేసి కంప్లైంట్ చేయొచ్చన్నారు.
ఎన్నికల ఖర్చు మానిటరింగ్‌కు స్పెషల్ సాఫ్ట్ వేర్ ఉపయోగిస్తామని తెలిపారు. ఓటు వేయడంలో వయోవృద్ధులకు సాయం చేయడానికి వాలంటీర్లను పెడుతున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రాసెస్ ప్రారంభమైందని మోడల్ కోడ్ అమలులోకి వచ్చిందన్నారు. సీనియర్ సిటిజన్స్ ఇంటి నుంచే ఓటు వేయొచ్చని నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.