తల్లికి నచ్చిన బట్టలు వేసుకొని కష్టపడుతున్న తెలంగాణ ఎంపీ

by GSrikanth |
తల్లికి నచ్చిన బట్టలు వేసుకొని కష్టపడుతున్న తెలంగాణ ఎంపీ
X

దిశ, వెబ్‌డెస్క్: నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ గురించి ప్రత్రేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హాట్ పొలిటికల్ కామెంట్లతో వార్తల్లో నిలుస్తుంటారు. అంతేకాదు.. సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ కేంద్రం తీసుకునే నిర్ణయాలపై స్పందిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంటారు. అయితే, ఇదిలా ఉండగా.. తాజాగా.. అర్వింద్ జిమ్‌లో కష్టపడుతున్న ఫొటో ట్విట్టర్‌లో పోస్టు చేశారు. పసుపు రంగు కలర్ డ్రెస్ వేసుకొని ఫొటో దిగారు. ‘ఇవాళ అమ్మ ఎల్లో కలర్ డ్రెస్ వేసుకోమని చెప్పింది’ అనే క్యాప్షన్ ఇచ్చారు. దీనికి నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. చంద్రబాబు అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ టీడీపీ కలర్ డ్రెస్ వేసుకొని సంఘీభావం తెలుపుతున్నాడని కొందరు కామెంట్లు పెడుతుంటే.. జిమ్ డ్రెస్‌లో WWE ఫైటర్ లాగా ఉన్నావన్నా అని మరి కొందరు కామెంట్లు పెడుతున్నారు.




Advertisement

Next Story