- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘రజాకార్’ మూవీ ఎఫెక్ట్.. ప్రజలకు MLC కవిత కీలక పిలుపు
by GSrikanth |
X
దిశ, డైనమిక్ బ్యూరో: ‘రజాకార్’ సినిమా టీజర్ వివాదస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందిస్తూ ఇవాళ మీడియాతో మాట్లాడారు. జనాల మధ్య దూరాన్ని పెంచే అంశాలతో బీజేపీ కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టిందని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. ఏ రాష్ట్రంలోనైనా ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారని ఆరోపించారు. దురదృష్టవశాత్తూ ఈసారి తెలంగాణలో రజాకార్ సినిమాను నిర్మించింది బీజేపీ నేత అని పేర్కొన్నారు.
గత పదేళ్లలో తెలంగాణ శాంతికి, మతపరమైన ఘర్షణలు లేకుండా, సామరస్యతకు పేరుగాంచిన రాష్ట్రమన్నారు. ఈ దేశంలోని ప్రతి రాష్ట్రం నుంచి ప్రజలు పని చేయడానికి హైదరాబాద్‌కు వస్తారని ఈ సందర్భంగా తెలిపారు. కాబట్టి శాంతిని కాపాడాలంటే ఇలాంటి వివాదాస్పద సినిమాలను తిరస్కరించాలని తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు.
Advertisement
Next Story