- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్‌కు ఓటేసి తప్పు చేశామని ఆల్రేడీ వాళ్లు బాధపడుతున్నారు: KTR
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ నేతలపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సమర్ధవంతమైన నాయకుడు ఉంటేనే అధివృద్ధి సాధ్యం అవుతుందని అన్నారు. అలాంటి నాయకుడే ప్రస్తుతం తెలంగాణకు ఉన్నాడని.. కేసీఆర్‌ను రాష్ట్ర ప్రజలు వదులుకోరని తెలిపారు. కాంగ్రెస్‌లో ఐదారుగురు ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉన్నారని ఎద్దేవా చేశారు. పోటీ చేయని జానారెడ్డి కూడా సీఎం అభ్యర్ధేనని విమర్శించారు. ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటే హైదరాబాద్ సురక్షితంగా ఉంటుందో ప్రజలకు తెలుసన్నారు. కాంగ్రెస్ అంటేనే కష్టాలు, కన్నీళ్లు, కడగండ్లు అని విమర్శించారు. ఆ పార్టీకి ఓటేసి తప్పు చేశామని కర్ణాటక రైతులు బాధపడుతున్నారని చెప్పారు.
కన్నడ రైతులు మన రాష్ట్రానికి వచ్చి కాంగ్రెస్ పాపాలను చెబుతున్నారని వెల్లడించారు. కరెంటు ఇవ్వనందుకు నిరసనగా రైతులు మొసళ్లు తెచ్చి సబ్‌స్టేషన్లలో వదులుతున్నారని తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధిని చూసి సినీ నటుడు రజనీకాంత్ ఆశ్చర్యపోయారని చెప్పారు. నగరం నలువైపులా టిమ్స్ సూపర్ స్పెషాలిటీ దవాఖానలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. గడ్డి అన్నారంలో వెయ్యి పడకల టిమ్స్ సిద్ధమవుతున్నదని, నిమ్స్‌లో మరో రెండువేల బెడ్స్‌తో కొత్త బ్లాక్ నిర్మిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ తూర్పు ప్రాంతానికి ఐటీ రంగాన్ని విస్తరిస్తున్నామన్నారు. మలక్‌పేట ఐటీ టవర్ పూర్తయితే 25 వేల మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పారు.