- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈటల రాజేందర్ 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తారేమో
దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌పై మంత్రి కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. శనివారం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధే తమ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ పని ఖతం అయిపోయిందని.. రాష్ట్రంలో ఎక్కడా డిపాజిట్ వచ్చే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఎవరూ అధైర్య పడొద్దని.. సర్వే రిపోర్టులు చూసి ఆగమాగం కావొద్దని సూచించారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ మనమే అధికారంలోకి వస్తామని భరోసా ఇచ్చారు. బీఆర్ఎస్ నేతలపై ఎక్కడా వ్యతిరేకత లేదని అన్నారు. బీజేపీకి ఒక్క సీటు కూడా రాదని ఎద్దేవా చేశారు. ఈటల రాజేందర్ 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తారేమో అని సెటైర్లు వేశారు. కాంగ్రెస్‌కు బీఆర్ఎస్ బీటీమ్ అనడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. కాంగ్రెస్, బీజేపీది ఆలూమగల బంధం అని విమర్శించారు. ప్రవళిక మృతిని కూడా రాజకీయంగా వాడుకోవాలని చూసిన దుర్మార్గులు రాష్ట్రంలో ఉన్నారని సీరియస్ అయ్యారు.