- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాదిగలకు మంత్రి హరీష్ రావు కీలక హామీ
దిశ, డైనమిక్ బ్యూరో: ఎస్సీ వర్గీకరణను ప్రధాని నరేంద్ర మోడీ ఆలస్యం చేస్తున్నారని, పార్లమెంట్‌లో వర్గీకరణ బిల్లు పాస్ చేయాల్సిందే మంత్రి హరీష్ రావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇవాళ ఇందిరాపార్కు వద్ద మాదిగల యుద్ధభేరి సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందుకు పోతుందని, తెలంగాణ దేశానికి దిక్సూచిగా మారాలని అన్నారు.
మాదిగల ఆత్మగౌరవం పెరగాలని, రాబోయే రోజుల్లో హైదరాబాద్‌లో మాదిగల కోసం ఆత్మగౌరవ భవనం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. సదా లక్ష్మీ విగ్రహం హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తదని, ఎస్సీల కోసం సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేశారని, మాదిగలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీ, నామినేటెడ్ పదవుల్లో గాని ఇతర అవకాశాలు మాదిగలకు తగిన ప్రాతినిధ్యం కల్పించడం కోసం సీఎం దృష్టికి తీసుకు వెళ్లనున్నట్లు వరాల జల్లు కురిపించారు.