మంత్రి గంగుల ప్రచార రథంపై చెప్పుతో దాడి

by GSrikanth |
మంత్రి గంగుల ప్రచార రథంపై చెప్పుతో దాడి
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఓట్ల కోసం వెళ్తున్న పలువురు బీఆర్ఎస్ అభ్యర్థులకు అసమ్మతి సెగలు తగులుతున్నాయి. ఇన్నాళ్లూ తమకు పట్టించుకోకుండా ఓట్ల కోసం ఇప్పుడు వస్తారా? అని నిలదీస్తున్నారు. ఇటువంటి తరుణంలో మంత్రి గంగుల కమలాకర్ ప్రచార వాహనంపై ఓ వ్యక్తి చెప్పుతో దాడి చేయడం కలకలం రేపింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా కమలాకర్‌కు ఓటు వేయాలని LED వాహనం కరీంనగర్ నియోజకవర్గంలోని గోపాల్ పూర్‌లో తిరుగుతూ ప్రచారం చేస్తోంది.

ఈ క్రమంలో జగదీశ్వరాచారి అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు ప్రచార రథంపై ఉన్న ఎల్ఈడీ స్క్రీన్‌లో గంగుల కమలాకర్ కనిపించగానే చెప్పుతో కొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌‌గా మారింది. దీంతో సదరు ఉపాధ్యాయుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా మంత్రిపై ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఎందుకంత కోపం పెంచుకున్నారనేది తెలియరాలేదు.

Advertisement

Next Story