- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాకూ 20 టికెట్లు ఇవ్వండి.. టీ.కాంగ్రెస్‌కు మరో BIG ట్విస్ట్
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ కాంగ్రెస్‌లో టికెట్ల కేటాయింపుల వ్యవహారం ఉత్కంఠ రేపుతున్నది. ఆయా సామాజిక వర్గాలు నుంచి రోజుకో కొత్త డిమాండ్ తెరమీదకు వస్తుండటంతో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ హాట్ టాపిక్ అవుతున్నది. తమకు తగినన్ని సీట్లు కేటాయించాలని ఇప్పటికే బీసీ, కమ్మ సామాజిక వర్గాల నేతలు డిమాండ్లు వినిపిస్తున్న వేళ అదే బాటలో మహిళా కాంగ్రెస్ నేతలు వెళ్తున్నారు. తాజాగా శనివారం మహిళా కాంగ్రెస్ నేతలు ఢిల్లీ పెద్దలను కలిశారు.
తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు నేతృత్వంలో మహిళా నేతల బృందం ఇవాళ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను కలిసి తమకు 20 టికెట్‌లు ఇవ్వాలని కోరారు. కాగా, తెలంగాణలో చాలా నియోజకవర్గాల్లో పోటీకి మహిళా కాంగ్రెస్ నేతలు సిద్ధంగా ఉన్నారని, క్షేత్ర స్థాయిలో మహిళా కాంగ్రెస్ బలంగా ఉందని మాకు సీట్లు ఇవ్వకుంటే ఇంటి ప్రచారం చేయబోమని గతంలోనే సునీత రావు తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో మరోసారి ఢిల్లీకి వెళ్లి పెద్దలను కలిసి తమ డిమాండ్లను వినిపించడం పార్టీలో ఇంట్రెస్టింగ్‌గా మారింది.