- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను తొలగించడంపై కిషన్ రెడ్డి క్లారిటీ
దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఫేవర్‌గా ఉంటారనే.. బండి సంజయ్‌ను తొలగించి కిషన్ రెడ్డిని ప్రెసిడెంట్‌గా పెట్టారని వస్తున్న ఆరోపణలపై కిషన్ రెడ్డి స్పందించారు. పార్టీ ప్రెసిడెంట్‌ను మార్చడం పార్టీ ఇంటర్నల్ మ్యాటర్ అని అన్నారు. వ్యక్తి కోసం నడిచే పార్టీ బీజేపీ కాదని పేర్కొన్నారు. తాను ఎవరికీ లొంగే వ్యక్తిని కానని, ఎవరికీ ఫేవర్‌గా ఉండబోనని, ఆ ఫేవర్ ఏంటో కూడా తనకు తెలియదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ కవితపై దర్యాప్తు సాగుతోందని, ఆమెను అరెస్ట్ చేయకుంటే బీఆర్ఎస్‌తో కుమ్మక్కయినట్లు కాదని అసహనం వ్యక్తం చేశారు. ఆమెను అరెస్ట్ చేయించాల్సిన కర్మ కానీ, అరెస్ట్ చేయొద్దని అడ్డుకునే కర్మ తమకు లేదన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియాను, రాహుల్‌ను కూడా విచారణ చేశారని, వారిని అరెస్టు చేయలేదంటే కాంగ్రెస్‌తో కుమ్మక్కయినట్లానని ప్రశ్నించారు.
సీఎం కేసీఆర్‌పై చర్యలు తీసుకుందామంటే.. సీబీఐ రావొద్దని జీవో తీసుకొచ్చారని, రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు జరపాలని కోరాడమో, హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశిస్తే చర్యలు తప్పకుండా ఉంటాయన్నారు. మంత్రి హరీష్ రావుపై కూడా గట్టి లీడర్‌ను బరిలోకి దింపుతామని ఆయన వెల్లడించారు. పార్టీ మారేవారు వ్యక్తిగత అవసరాల కోసం పార్టీ మారుతున్నారన్నారు. ఎన్ని సీట్లు వచ్చినా అధికారం బీజేపీదేనని తమ పార్టీ నేతలు ఏ సందర్భంలో అన్నారో తెలియదని వెల్లడించారు. తెలంగాణకు కేంద్రం ఏమిచ్చిందని అంటున్నారని, కేసీఆర్‌కు దమ్ముంటే చర్చకు సిద్ధమా? అని కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. నామినేషన్ల విత్ డ్రా తరువాత మేనిఫెస్టో అనౌన్స్ చేయడం బీజేపీలో ఆనవాయితీగా వస్తోందని, అన్ని వర్గాల ప్రజలు, మేధావులతో చర్చలు జరిపి మంచి మేనిఫెస్టో అందిస్తామని ఆయన స్పష్టంచేశారు.