- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎంగా ప్రమాణం చేసిన రోజే ఆదేశాలిచ్చాం: సిద్దరామయ్య
దిశ, డైనమిక్ బ్యూరో: కేసీఆర్, బీఆర్‌ఎస్ నాయకులు కర్ణాటకవస్తే.. సాధరంగా స్వాగతించి గ్యారెంటీల అమలుపై ఆధారాలు కూడా ఇస్తామని కర్ణాటక సీఎం సిద్దరామయ్య వెల్లడించారు. కర్ణాటకలో గ్యారెంటీలను అమలు చేస్తున్నామని, తాము ఎవరినీ మోసం చేయలేదని, అందరికీ అన్నీ నెరవేర్చామని స్పష్టంచేశారు. ఇవాళ ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. మే20న ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశానని, అదే రోజు కేబినెట్ భేటీ ఏర్పాటు చేసి గ్యారెంటీల అమలుకు ఆదేశాలిచ్చామని స్పష్టంచేశారు. అయితే వాటి అమలు కొంచెం ఆలస్యమైందన్నారు. కర్ణాటకలో ఇచ్చిన గ్యారెంటీలను అమలుచేయడం లేదంటూ బీఆర్‌ఎస్, బీజేపీలు ఆరోపణలు వార్తలు చూసి తెలుసుకున్నట్లు తెలిపారు. వారు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. తొలి గ్యారెంటీగా శక్తి యోజన స్కీమ్‌ను జులైలో అమలు చేశామన్నారు. ఆరు నెలల్లోనే వంద కోట్ల నలభై ఏడు లక్షల టికెట్లు మహిళలకు ఉచితంగా అందజేశామని తెలిపారు. మేము చెప్పేదాంట్లో ఒక్కటి కూడా అబద్ధం లేదన్నారు.
అన్న భాగ్య యోజన కింద ఒక్కొక్కరికీ పది కిలోల బియ్యం ఉచితంగా ఇస్తున్నామని, కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోకపోవడంతో తాము నేరుగా లబ్ధిదారులకు బియ్యానికి అయ్యే డబ్బులు అకౌంట్లలో వేస్తున్నామని అన్నారు. ఎఫ్‌సీఐ బియ్యం ఇచ్చేందుకు ఒప్పుకున్నా బియ్యం లేవని కేంద్రం అడ్డుపుల్ల వేసిందని ఆరోపణలు చేశారు. కిలో రూ.34 చొప్పున ఒక్కొక్కరికి పది కిలోలకుగానూ రూ.340 అకౌంట్లలో వేస్తున్నామని అన్నారు. గృహజ్యోతి పథకం కింద.. 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్‌ను అందిస్తున్నాం.. జులై నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు.
యువనిధి పథకం కింద డిగ్రీ చదివిన నిరుద్యోగులకు రూ.3000.. డిప్లమా చదివిన నిరుద్యోగులకు రూ.1500 ఆర్థిక సాయం అందిస్తున్నామని స్పష్టంచేశారు. అది కూడా రెండేండ్ల వరకే.. అప్పటిలోగా నిరుద్యోగులకు స్కిల్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. ఈ పథకం వచ్చే ఏడాది జనవరి నుంచి అమలు చేస్తాం.. మా మీద ఆరోపణలు చేస్తున్న కేసీఆర్‌ను కర్ణాటక వచ్చి అన్ని డాక్యుమెంట్లను చెక్ చేసుకోమన్నా.. కానీ ఆయన రాలేదు.. ఇప్పటికైనా ఆయన వచ్చి చూసుకోవచ్చని సూచించారు. గ్యారెంటీలను అమలు చేస్తే కర్ణాటక ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుందని మోడీ ఆరోపిస్తున్నారని, కానీ, కర్ణాటక ఆర్థికంగా చాలా బలంగా ఉందన్నారు.