టికెట్ కావాలంటే రూ.10 వేలు గూగుల్ పే చేయండి.. కేఏ పాల్ సంచలన ప్రకటన

by GSrikanth |
టికెట్ కావాలంటే రూ.10 వేలు గూగుల్ పే చేయండి.. కేఏ పాల్ సంచలన ప్రకటన
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ప్రజాశాంతి పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని, వారం రోజుల్లోగా అభ్యర్థుల జాబితా విడుదల చేస్తామని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ తెలిపారు. అసెంబ్లీ టికెట్ల కోసం ఎవర్నీ అడగోద్దని, ప్రజాశాంతి పార్టీ సిద్ధంగా ఉందని, బీసీని సీఎం చేద్దామని పిలుపునిచ్చారు. ఎక్కువ శాతం ఉన్న బీసీల నుంచి ఒక్క సీఎం కూడా లేరన్నారు. బీసీలకు 60 శాతం, మహిళలకు 33 శాతం టికెట్లు సీట్లు ఇవ్వడానికి తను సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.

తన పార్టీలో పోటీ చేయాలనుకునే వారు వారం రోజుల్లోగా రూ.10 వేలు గూగుల్ పే చేసి, దరఖాస్తు పంపాలన్నారు. మరోవైపు పోటీకి సిద్ధంగా ఉన్నట్లు ఇప్పటికే 3 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయని స్పష్టంచేశారు. నవంబర్ 30న కేసీఆర్‌కి గుడ్ బై చెప్పాలంటే.. ముందు కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటే అని ఆరోపించారు. దేశాన్ని సర్వనాశనం చేసిందే కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు.

Advertisement

Next Story