కాంగ్రెస్‌ సెకండ్ లిస్ట్‌పై తీవ్ర ఉత్కంఠ.. ఆ 8 సెగ్మెంట్లలో హోరాహోరీ పోటీ

by GSrikanth |
కాంగ్రెస్‌ సెకండ్ లిస్ట్‌పై తీవ్ర ఉత్కంఠ.. ఆ 8 సెగ్మెంట్లలో హోరాహోరీ పోటీ
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్‌ సెకండ్ లిస్ట్‌పై ఉత్కంఠ కొనసాగుతోంది. సీఈసీ సమావేశం తర్వాత ఈ జాబితా విడుదల కానుంది. దాదాపు 8 నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక కష్టంగా మారినట్లు తెలుస్తోంది. ఈ 8 సెగ్మెంట్లలో పార్టీ అభ్యర్థుల మధ్య హోరా హోరీ పోటీ నెలకొంది. సూర్యాపేటలో రమేశ్ రెడ్డి/దామోదర్ రెడ్డి, తుంగతుర్తిలో అద్దంకి దయాకర్/డాక్టర్ రవి/ప్రీతం, మహేశ్వరంలో కేఎల్ఆర్/పారిజాతారెడ్డి, జడ్చర్లలో ఎర్ర శేఖర్/అనిరుధ్ రెడ్డి, మక్తల్‌లో శ్రీహరి/ప్రశాంత్ రెడ్డి, సిరిసిల్లలో కేకే మహేందర్ రెడ్డి/ఉమేశ్ రావు, శేరిలింగంపల్లిలో సత్యనారాయణ రావు/రఘునాథ్ యాదవ్, పరకాలలో కొండా మురళి/వెంకట్ రామిరెడ్డిల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. దీంతో ఈ ఎనిమిది సెగ్మెంట్లలో అభ్యర్థులను ఖరారు చేయడం అధిష్టానానికి కష్టతరంగా మారింది.

Advertisement

Next Story