బీఆర్ఎస్‌లో ఏక్‌నాథ్ షిండేలు.. మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

by GSrikanth |
బీఆర్ఎస్‌లో ఏక్‌నాథ్ షిండేలు.. మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ పార్టీలో ఏక్‌నాథ్ షిండేలు ఉన్నారని మాజీ మంత్రి, కాంగ్రెస్ కీలక నేత షబ్బీర్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్‌లో ఏక్‭నాథ్ షిండేలు తయారయ్యారని, పార్టీ మూడు ముక్కలు కావడం ఖాయమని అన్నారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుతున్నారని, కాంగ్రెస్ అధికారంలోకి రావడమూ ఖాయమని జోస్యం చెప్పారు. ఇక బీఆర్ఎస్ మునిగే నావని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బీజేపీ ఖాళీ అయిందని, ఇక ఆ పార్టీ డిజిట్‌కే పరిమితం అవుతుందని తెలిపారు. పార్టీ మారేవాళ్లంతా ఇప్పటికే పార్టీ నుంచి వెళ్లిపోయారని, ఇక కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్లంతా 24 క్యారెట్ల గోల్డ్ అని ఆయన అన్నారు. నిజమాబాద్ అర్బన్‌లో తనకు ఎవరూ పోటీ కాదని, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు తన దరిదాపుల్లో కూడా లేరని, అక్కడ కాంగ్రెస్ పార్టీదే విజయమని షబ్బీర్ అన్నారు.




Advertisement

Next Story