- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్‌కు కేటుగాళ్ల ఫోన్
దిశ, డైనమిక్ బ్యూరో: కేటుగాళ్లు సామాన్యులతో పాటు ప్రముఖులను కూడా వదలడం లేదు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్‌ను బురిడీ కొట్టించే ప్రయత్నం చేసి విఫలం అయ్యారు. వీహెచ్ తెలివిగా వ్యవహరించడంతో కేటుగాళ్ల బారిన పడకుండా తప్పించుకోగలిగారు. ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. వీహెచ్‌కు హరిరామ జోగయ్య పేరిట ఓ ఫోన్ కాల్ వచ్చింది. 78010 96535 నెంబర్ నుంచి మాట్లాడుతూ తాను ఆపదలో ఉన్నానని అర్జెంట్‌గా 96521 96535 నెంబర్‌కు గూగుల్ పే ద్వారా డబ్బులు వేయాలని కోరారు.
అయితే అది హరిరామ జోగయ్య నెంబర్ కాకపోవడంతో వీహెచ్‌కు అనుమానం వచ్చింది. వెంటనే ఓ వ్యక్తిని హరిరామజోగయ్య ఇంటికి పంపించి ఆరా తీయగా అది ఫేక్ అని తేలింది. దీంతో వీహెచ్ వెస్ట్ గోదావరి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వీహెచ్‌కు ఖమ్మం నుంచి ఫోన్ వచ్చినట్లు గుర్తించి వీహెచ్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో ఖమ్మం ఎస్పీ, సైబరాబాద్ పోలీస్‌లకు వీహెచ్ ఫిర్యాదు చేశారు.