సీఎం కేసీఆర్‌కు షాకిచ్చేలా.. తెలంగాణ కాంగ్రెస్ మరో సెన్సేషన్

by GSrikanth |
సీఎం కేసీఆర్‌కు షాకిచ్చేలా.. తెలంగాణ కాంగ్రెస్ మరో సెన్సేషన్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ‘కల్వకుంట్ల క్రియేటివ్స్ వారి కమీషన్ కాకతీయ’ అంటూ తెలంగాణ కాంగ్రెస్ మరోసారి తీవ్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించింది. కేసీఆర్ తీసుకొచ్చిన మిషన్ కాకతీయ పథకాన్ని ‘కమీషన్ కాకతీయ’ పథకం అంటూ ఆరోపించింది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ కార్యక్రమం 20,000కు పైగా మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల పునరుద్ధరణ లక్ష్యంతో పెద్ద కుంభకోణానికి తెరతీసిందని ఆరోపించింది. ఇరిగేషన్ ట్యాంకుల పునరుద్ధరణ పేరుతో కాంట్రాక్టులు దక్కించుకుని స్థానిక టీఆర్‌ఎస్ నాయకులు పెద్ద ఎత్తున సొమ్ము చేసుకునేందుకు ఈ పథకం దోహదపడిందని ఆరోపించింది. నాణ్యమైన పనులు చేపట్టకపోగా, మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరుతో కాంట్రాక్టులకు డబ్బులు పంచి చివరకు నాసిరకమైన పనులే చేశారని తీవ్ర స్థాయిలో ఆరోపించింది.

భగీరథ స్టైల్ స్కామ్!

రాష్ట్రంలోని ఇంటింటికీ తాగునీరు అందిస్తామని చెప్పి మిషన్ భగీరథ పేరుతో 42 వేల కోట్లు ఖర్చు చేశారని, అయితే మెజారిటీ ఇళ్లకు నీరు అందకపోవడంతో ఈ పథకం పెద్ద కుంభకోణంగా తేలిందని ఆరోపించింది. భగీరథ స్టైల్ స్కామ్ చేశారని విమర్శించింది. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ ఇవాళ ట్విట్టర్‌లో ‘బుక్ మై సీఎం’ అంటూ ఒక ఫోటో పోస్ట్ చేసింది. ‘కల్వకుంట్ల క్రియేటివ్స్ వారి కమిషన్ కాకతీయ.. కాంట్రాక్టర్లు చెరువులు తవ్వితే.. కేసీఆర్ కమీషన్లు తోడాడు.. 30 శాతం కమీషన్, బై బై కేసీఆర్’ అంటూ తెలంగాణ కాంగ్రెస్ ఆరోపించింది.


Advertisement

Next Story

Most Viewed