- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మైనంపల్లిని కలిసిన భట్టి.. మూడు సీట్లు కావాలని రిక్వెస్ట్!
దిశ, దుండిగల్: ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావును కాంగ్రెస్‌లోకి రావాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆహ్వానించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగరబోతున్నదని ఆయన వివరించారు. రెండు టికెట్ల అంశం, పార్టీ నిర్ణయాలు, భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా, అంతకంటే ముందే మల్కాజ్‌గిరి డీసీసీ అధ్యక్షులు నందికంటి శ్రీధర్‌తో భట్టి భేటీ అయ్యారు. ఈనెల 27లోపు త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరుతానని మైనంపల్లి చెప్పారు.
నియోజకవర్గంలో చేసిన సర్వే ఆధారంగా తనకు, నా కుమారుడికి కూడా అవకాశం ఇస్తారని భావిస్తున్నామన్నారు. అప్పుడే తమ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం కూని అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు పదవులు ముఖ్యం కాదని, కార్యకర్తల కోసం ప్రాణాలు ఇచ్చేందుకు సైతం వెనకాడనని అన్నారు. మేడ్చల్, మల్కాజిగిరి, మెదక్ సీట్లు ఆశిస్తున్నట్లు తెలిపారు. మేడ్చల్ ఎమ్మెల్యే సీటు నక్క ప్రభాకర్ గౌడ్‌కు ఇవ్వాలని, ప్రభాకర్ నాకు సొంత తమ్ముడితో సమానం అన్నారు. మైనంపల్లిని కలిసిన అనంతరం కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంజన్ కుమార్ యాదవ్, దామోదర రాజనరసింహ, మహేశ్ కమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.