నిరూపిస్తా అంటే తడిబట్టలతో వస్తా.. కేసీఆర్‌కు పొంగులేటి సవాల్

by GSrikanth |
నిరూపిస్తా అంటే తడిబట్టలతో వస్తా.. కేసీఆర్‌కు పొంగులేటి సవాల్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావాల్సిన అనివార్య పరిస్థితులు ఏర్పడ్డాయని పార్టీ ముఖ్యనేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అభిప్రాయపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ఆవశ్యకత, అవసరం, ప్రజలను ఎంత ఇబ్బంది పెట్టిందో చెప్పబోతున్నామని అన్నారు. రాబోయే ఎన్నికల్లో కనీవినీ ఎరుగని రీతిలో ఫలితాలుంటాయని జోస్యం చెప్పారు. నిన్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పాలేరులో అవాకులు చెవాకులు పేలారు.. దానికి తుమ్మల గట్టిగానే ఇచ్చారని అన్నారు. నా పేరు ప్రస్తావించకుండా నన్ను టార్గెట్ చేసి మాట్లాడారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేసే విధంగా డబ్బు మదం అనే పదాలు వాడారు. అసలు ప్రజాస్వామ్యం అంటే అర్థం కేసీఆర్‌‌కు తెలుసా? అని ప్రశ్నించారు.

పాలేరు సభలో కేసీఆర్ పక్కన కూర్చున్న వాళ్ళు ఏ పార్టీలో గెలిచారో తెలిసే మాట్లాడారా? అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌లో గెలిచిన వారిని పక్కన పెట్టుకొని నీతులు చెబుతున్నాడని ఎద్దేవా చేశారు. నాలుగు కాంట్రాక్టులు, పైరవీలు చేసి తాము డబ్బు సమపాదించలేదు. దమ్ముంటే నిరూపించాలి. తాను తడిబట్టలతో వస్తా.. మీరు వస్తారా..? అని సీఎం కేసీఆర్‌కు పొంగులేటి సవాల్ చేశారు. పాలేరు సభలో తుమ్మల పేరు ప్రస్తావించారు.. కాబట్టి సరిపోయింది. నా పేరు ఎత్తుకుంటే తెలిసేది నా సత్తా ఏంటో అని అన్నారు. ఇప్పటికీ తాను చెప్పిన మాటలకు కట్టుబడి ఉన్నా.. ఉమ్మడి ఖమ్మంలో ఒక్క బీఆర్ఎస్ అభ్యర్థిని గెలవనిచ్చేది లేదు అని అన్నారు. కాంగ్రెస్‌కు 80 నుంచి 82 సీట్లు వస్తున్నాయి.. ఇంకా పెరిగే అవకాశం కూడా ఉందని జోస్యం చెప్పారు.

Advertisement

Next Story