తెలంగాణను సూసైడ్ క్యాపిటల్‌గా మార్చారు: పవన్ ఖేరా

by GSrikanth |
తెలంగాణను సూసైడ్ క్యాపిటల్‌గా మార్చారు: పవన్ ఖేరా
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ దేశానికి సూసైడ్ క్యాపిటల్‌గా మారిందని ఏఐసీసీ మీడియా కమిటీ చైర్మన్ పవన్ ఖేరా విమర్శించారు. పరీక్షల అప్లికేషన్ల ఫీజుల పేరుతో నిరుద్యోగుల నుంచి రూ.220 కోట్లు ఈ ప్రభుత్వం దోచుకుని ఒక్క పరీక్ష కూడా సక్రమంగా నిర్వహించలేకపోయిందని ధ్వజమెత్తారు. సోమవారం గాంధీ భవన్‌లో ఏఐసీసీ నేతలు అజయ్ కుమార్, కుసుమ కుమార్, టీపీసీసీ నేతలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, రోహన్ గుప్తాలతో కలిసి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

వరుసగా 2 సార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం.. ప్రజలను మోసం చేశారన్నారు. అలాంటి పార్టీని బంగాళాఖాతంలో కలపాలన్నారు. ఉద్యోగాలు రాక రాష్ట్రంలో 3600 మంది నిరుద్యోగులు సూసైడ్ చేసుకున్నారని ఇది తాను చెబుతున్న లెక్కలు కావని ఎన్సీఆర్బీ చెబుతున్న లెక్కలన్నారు. ఇటీవల నిరుద్యోగ యువతి ప్రవళిక ఆత్మహత్య చేసుకుంటే ఆమె క్యారెక్టర్‌ను కించపరిచారని దుయ్యబట్టారు. ప్రజలు కష్టాలు పడుతుంటే కేసీఆర్ మాత్రం ఫామ్ హౌస్‌లో రాజభోగాలు అనుభవిస్తున్నాడని విమర్శించారు. తెలంగాణ ప్రజల సమస్యలన్నింటికీ పరిష్కారం నవంబర్ 30న ఇచ్చే తీర్పే అన్నారు. కేసీఆర్‌పై మీ కోపాన్ని నవంబర్ 30న ఓటు రూపంలో చూపెట్టాలని ప్రజలను కోరారు.

Advertisement

Next Story