బీఆర్ఎస్ కార్యకర్తలు టైమ్ వేస్ట్ చేసుకోవద్దు: డీకే శివకుమార్

by GSrikanth |
బీఆర్ఎస్ కార్యకర్తలు టైమ్ వేస్ట్ చేసుకోవద్దు: డీకే శివకుమార్
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ కార్యకర్తలు టైమ్ వేస్ట్ చేసుకోవద్దని.. ఈ ఎన్నికల్లో గులాబీ ఎమ్మెల్యేలతో పాటు కేసీఆర్ ఓడిపోవడం ఖాయమని కాంగ్రెస్ కీలక నేత, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆరే కాదని ఫ్యామిలీ మొత్తం ఫామ్‌హౌజ్‌కే పరిమితం కాబోతున్నారని జోస్యం చెప్పారు. ఓటమి భయంతోనే అసహనం చెంది కాంగ్రెస్‌పై, కాంగ్రెస్ నేతలపై కేసీఆర్ ఆరోపణలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. 75 నుంచి 80 నియోజకవర్గాల్లో గెలిచి కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోందని అన్నారు. తాము అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతికి పాల్పడిన ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టబోమని హెచ్చరించారు.

Advertisement

Next Story