- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో వారికి సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్
దిశ, వెబ్‌డెస్క్: గోల్కొండ కోటలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. త్వరలోనే కొత్తగా పీఆర్సీ నియమించి ఉద్యోగుల వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చారు. అప్పటివరకు మధ్యంతర భృతి చెల్లి్స్తామని స్వయంగా ప్రకటించానని గుర్తుచేశారు. సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి బోనస్‌గా రూ.వెయ్యి కోట్లు పంపిణీ చేస్తామని ప్రకటించారు. వచ్చే 3, 4 ఏళ్లలో మెట్రో రైలు పూర్తి చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.
కొత్త ప్రతిపాదనలతో హైదరాబాద్‌లో 415 కిలోమీటర్ల మెట్రో సౌకర్యం పెరగనుందని అన్నారు. రూ.2.51 లక్షల కోట్ల పెట్టుబడులతో కొత్త పరిశ్రమలు వచ్చాయని తెలిపారు. తొమ్మిదిన్నర ఏళ్లలో పారిశ్రామిక రంగంలో 17.21 లక్షల మందికి ఉపాధి కల్పించామని అన్నారు. చేనేత కార్మికుల కోసం మరో కొత్త పథకం అమలుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రజల్లో ప్రభుత్వానికి వస్తున్న ఆదరన చూసి కొందరు ఆందోళన చెందుతున్నారని సెటైర్లు వేశారు. సంకుచిత శక్తులు ఆర్టీసీ బిల్లును అడ్డుకునేందుకు ప్రయత్నించాయని విమర్శించాయని అన్నారు. అయినా వెనక్కి తగ్గకుండా బిల్లును ఆమోదించినట్లు గుర్తుచేశారు.