తెలంగాణలో పోటీ చేయట్లేదు.. చంద్రబాబు సంచలన నిర్ణయం

by GSrikanth |
తెలంగాణలో పోటీ చేయట్లేదు.. చంద్రబాబు సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈసారి ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణపై తాము దృష్టి పెట్టలేమని తెలంగాణ నేతలకు చెప్పారు. ఈ విషయాన్ని నిన్న ములాఖత్ అయిన కాసాని జ్ఙానేశ్వర్‌తో చంద్రబాబు చెప్పారు. ఏ పరిస్థితుల్లో టీడీపీ పోటీ చేయట్లేదో కూడా పార్టీ శ్రేణులకు వివరించాలని లీడర్లకు చెప్పారు. లోక్‌సభ ఎన్నికలకు పార్టీని సిద్ధం చేయాలని ఆదేశించారు. ఏపీలో గెలిస్తే తెలంగాణలో బలపడటం సులభమని చెప్పినట్లు సమాచారం. మరి చంద్రబాబు నిర్ణయంపై రాష్ట్ర నేతలు, కార్యకర్తలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

Advertisement

Next Story