ఆ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్‌ ముందంజ

by GSrikanth |
ఆ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్‌ ముందంజ
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కాంగ్రెస్ ముందంజలో కొనసాగుతుండగా.. ఆ జిల్లాలో పరిస్థితి రివర్స్ అయింది. అనూహ్యంగా బీఆర్ఎస్‌ అభ్యర్థులు దూకుడు ప్రదర్శిస్తున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల్లో పోస్టల్ బ్యాలెట్ల ఓట్లలో బీఆర్ఎస్ ముందంజలో ఉంది. కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, మేడ్చల్, ఉప్పల్, మల్కాజిగిరి నుంచి బరిలో ఉన్న కేపీ వివేకానందా, మాధవరం కృష్ణారావు, మల్లారెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి ముందంజలో ఉన్నారు.

Advertisement

Next Story