- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అదంతా అబద్దం.. కేటీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ లక్ష్మణ్ రియాక్షన్
దిశ, డైనమిక్ బ్యూరో: 2018 ఎన్నికల్లో బీజేపీ బీఆర్‌ఎస్‌కు మద్దతిస్తుందని నేను చెప్పినట్లు మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదిక చేసిన వ్యాఖ్యలను బీజేపీ రాజ్యసభ సభ్యుడు కె లక్ష్మణ్ ఖండించారు. కేటీఆర్ వ్యాఖ్యలు అసత్యమని ఇవి దురుద్దేశపూరితమైనవని బుధవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. బుకాయించడం, దబాయించడం, అబద్ధాలు చెప్పడం కల్వకుంట్ల కుటుంబానికి అలవాటేనని తమ తప్పులను ఎత్తిచూపితే కండ్లమంటతో బట్టగాల్చి మీదేసేలా నిందలు, దుష్ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. బీఆర్ఎస్ అవసరాల కోసం పక్కదారులు తొక్కే పార్టీ అయితే బీజేపీ ఒక సిద్దాంతానికి కట్టుబడి ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా నడుచుకునే పార్టీ అన్నారు.
తెలంగాణ ఆవిర్భావం నుంచి బీఆర్ఎస్ పార్టీ పొత్తులతోనే కాలం వెల్లదీసిందని ప్రతి ఎన్నికల్లో వివిధ పార్టీలతో తెరచాటు ఒప్పందాలు, పొత్తులు పెట్టుకుందని ఇందుకు జీహెచ్ఎంసీ, మునుగోడు ఉప ఎన్నికలే నిదర్శనం అన్నారు. వారసత్వ, కుటుంబ, వ్యక్తి ఆధారిత రాజకీయాలతో బీఆర్ఎస్ రాజకీయాలను విషతుల్యం చేస్తోందని ధ్వజమెత్తారు. వారసత్వ, కుటుంబ రాజకీయాలతో సంబంధమున్న ఏ పార్టీని కూడా బీజేపీ ప్రోత్సహించదు, దరిచేరనివ్వదన్నారు. ఎన్నికల్లో నైతికంగా గెలిచేవారినే యోధులు అంటారు. అవకాశవాద రాజకీయాలతో గట్టెక్కే పరాన్నజీవిగా బీఆర్ఎస్ ముద్ర వేసుకుందని ఆరోపించారు. బీఆర్ఎస్-కాంగ్రెస్-ఎంఐఎం కుమ్మక్కు రాజీకీయాలను ప్రజలు గమనిస్తున్నారని బీజేపీకి వస్తున్న ప్రజాధరణను చూసి ఓర్వలేకే ఓటమి భయంతో బీజేపీపై బీఆర్ఎస్ అబద్దాలు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.