- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
హైదరాబాద్‌లో మరోసారి ఐటీ పంజా.. ఈసారి టార్గెట్ బీఆర్ఎస్!
దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ ఐటీ అధికారులు దూకుడు ప్రదర్శిస్తున్నారు. గతకొన్ని రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా విస్తృతంగా ప్రముఖుల ఇళ్లలో దాడులు జరుపుతున్నారు. ఇప్పటివరకు కాంగ్రెస్ నేతలు టార్గెట్‌గా ఐటీ సోదాలు జరగ్గా.. నేడు ప్రముఖ ఫార్మా కంపెనీ పైన ఐటీ శాఖ సోదాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా 15 చోట్ల ఏకకాలంలో దాడులు చేస్తున్నారు. ఫార్మా కంపెనీ యజమాని ఇల్లుతో పాటు కార్యాలయాలు, సిబ్బంది ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తోంది. ఫార్మా కంపెనీ చైర్మన్ సీఈవో, కంపెనీ డైరెక్టర్‌ల నివాసాల్లో ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. ముఖ్యంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి టార్గెట్‌గా దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. సబితా ఇంద్రారెడ్డి సమీప బంధువైన ప్రముఖ రియల్టర్ ప్రదీప్ రెడ్డి ఇల్లు, కార్యాయాల్లో దాడులు జరుపుతున్నారు. ఇటీవలే మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి ఇంట్లో దాడులు జరిగిన విషయం తెలిసిందే.