కేసీఆర్ సూచనలతోనే హరీష్ రావు బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు

by GSrikanth |
కేసీఆర్ సూచనలతోనే హరీష్ రావు బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: రైతుబంధుకు ఈసీ అనుమమతి ఉపసంహరించుకోవడం వెనుక కేసీఆర్, హరీష్ రావు ఉన్నారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ సూచనలతోనే రైతుబంధు నిలిచిపోయేలా హరీష్ రావు బాధ్యతాయుత వ్యాఖ్యలు చేశారని ధ్వజమెత్తారు. రైతుబంధు విషయంలో కేసీఆర్ చెప్పడం వల్లే ఈసీ అనుమతులు నిరాకరించిందని ఆరోపించారు. సోమవారం ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయిన కేసీ వేణుగోపాల్.. రైతుబంధు డబ్బులు రైతుల హక్కు అని ఇది వారి శ్రమకు దక్కాల్సిన ఫలితం అన్నారు. కానీ, బీఆర్ఎస్ బాధ్యతారహిత ప్రకటనలు చేసి రైతుబంధును ఆపేలా చేశారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ క్షమించరాని పాపం చేసిందని తెలంగాణ రైతులు బీఆర్ఎస్‌ను ఎన్నటికీ క్షమించరన్నారు.

Next Story

Most Viewed