- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Zomato: గెట్ ‘హలీమ్’ ఇన్ టెన్ మినిట్స్.. హైదరాబాద్‌లో జొమాటో స్కై డ్రోన్ షో.. వైరల్

దిశ, డైనమిక్ బ్యూరో/శేరిలింగంపల్లి: జొమాటో (Zomato) ఫుడ్ డెలివరీ సంస్థ తన కస్టమర్లను ఆకట్టుకోడానికి ఎప్పటికప్పుడు అఫర్‌లు ఇవ్వడంతో పాటు అడ్వర్టైజ్మెంట్‌లో కూడా ముందుంటుంది. తన బ్రాండ్ వాల్యూ పెంచుకోవడానికి వినూత్న తీరులో ప్రకటనలు ఇస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ప్రాంతంలో రాత్రి సమయంలో ఊహించని తీరులో డ్రోన్ షో నిర్వహించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రంజాన్ పండుగ సీజన్ కావడంతో ‘హలీమ్’ ప్రియులకు ఆకట్టుకునేలా డ్రోన్ షో ద్వారా ప్రచారం చేసింది. గెట్ ‘హలీమ్’ ఇన్ టెన్ మినిట్స్.. అని, ఫ్యామిలీని చూపిస్తూ ఆకాశంలో డ్రోన్ షో కనువిందు చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ డ్రోన్ షో నిర్వహించిన వారు అసలు పోలీసుల పర్మిషన్ తీసుకున్నారా? అనే చర్చ సైతం నెట్టింట మొదలైంది. ఈ క్రమంలోనే సైబరాబాద్ పోలీసులకు వీడియోను ట్యాగ్ చేస్తూ.. స్కై డ్రోన్ షోకి జొమాటో అనుమతి తీసుకుంటుందా? ఎవరైనా సామాన్యుడు దానిని చూసి భయపడితే? అని ఓ నెటిజన్ ఫిర్యాదు చేశారు.