- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బీఆర్ఎస్‌ది దిక్కుమాలిన పాలన కాదా?: షర్మిల
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ దర్యాప్తుపై పెట్టిన శ్రద్ధ టీఎస్ పీఎస్సీ లీకేజీ విచారణపై ఎందుకు పెట్టడంలేదని వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ షర్మిల ప్రశ్నించారు. అలా చేస్తే బీఆర్ఎస్ పెద్ద తలకాయలు బయటపడతాయనా? అని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. విచారణ చేపట్టి టెన్త్ క్లాస్ పేపర్లను లీక్ దోషులను శిక్షించాల్సిందేనని డిమాండ్ చేశారు. బందిపోట్ల రాష్ట్ర సమితి నేతల కండ్లకు, చెవులకు 30 లక్షల మంది నిరుద్యోగుల కన్నీటి రోదన కనపడటం, వినపడటం లేదా అని ఆమె మండిపడ్డారు.
పదో తరగతి పేపర్ లీక్ జరిగిందంటే బీఆర్ఎస్‌ది దిక్కుమాలిన పాలన కాదా? అని ఆమె ప్రశ్నించారు. పేపర్ లీకవ్వగానే ముగ్గురు టీచర్లను డిస్మిస్ చేసి, బలి చేసిన ప్రభుత్వం టీఎస్ పీఎస్సీ ఉద్యోగులు, బోర్డు సభ్యులు, చైర్మన్‌ను వెంటనే ఎందుకు తొలగించలేదో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ఇందులో బీఆర్ఎస్ బడా నేతల హస్తం ఉందని విచారణ చేపట్టడం లేదా? లేక వాళ్లంతా బీఆర్ఎస్ నేతల తొత్తులని పట్టించుకోవడం లేదా అని ఫైరయ్యారు. ఎస్సెస్సీ పేపర్ లీకుల్లో స్వయానా ప్రతిపక్ష నేత హస్తం ఉందని తేల్చిన పోలీస్ వ్యవస్థ టీఎస్ పీఎస్సీ లీకుల స్కాంలో దాగి ఉన్న ఇంటి దొంగలను బయటపెట్టకపోతే రానున్న ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వానికి నిరుద్యోగులు ఘోరీ కట్టడం తథ్యమని హెచ్చరించారు.