కాంగ్రెస్‌తో కలిసి పనిచేయడానికి అభ్యంతరం లేదు: షర్మిల

by GSrikanth |
కాంగ్రెస్‌తో కలిసి పనిచేయడానికి అభ్యంతరం లేదు: షర్మిల
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్‌లో చేరికపై వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల స్పందించారు. మంగళవారం హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో పార్టీ ముఖ్య కార్యకర్తలతో సమావేశం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రేపు(బుధవారం) ఢిల్లీ వెళ్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆహ్వానం అందిందని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌తో కలిసి పనిచేయడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకటి రెండు రోజుల్లో అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతా అని క్లారిటీ ఇచ్చారు.

Advertisement

Next Story