- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'ఆ TRS ఎమ్మెల్యేకు ప్రజలంతా కర్రుకాల్చి వాతపెట్టాలే'
దిశ, వెబ్‌డెస్క్: టీఆర్ఎస్ సర్కార్, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా వేదికగా గులాబీ నేతలపై విమర్శనాస్త్రాలు సంధించారు. ''ఎన్నికల సమయంలో కేసీఆర్, బంగారు నాగర్ కర్నూలు చేస్తానని చెప్పి, బతుకే లేకుండా చేశాడు. ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ కాలేజీలు లేవు. మెడికల్ కాలేజీకి దళితుల భూములు అప్పనంగా గుంజుకుని, దళితుల్ని రోడ్డున పడేశారు. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యేకు రెండుసార్లు అధికారమిస్తే.. ప్రజలను గాలికొదిలి నల్లమట్టి వ్యాపారంలోనే మునుగుతున్నడు. ఇసుక దందాలు, భూ కబ్జాలతో బిజీ అయ్యాడు. వచ్చే ఎన్నికల్లో ఆ ఎమ్మెల్యేకు ప్రజలంతా కర్రుకాల్చి వాతపెట్టాలె. అభివృద్ధిలో పోటీ పడాల్సిన పార్టీలు.. దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్నాయి. సెప్టెంబర్ 17న బీజేపీ పార్టీ విమోచన దినమట, టీఆర్ఎస్ పార్టీ సమైక్యత దినమట. అధికారంలో ఉండి ప్రజలకు పనికొచ్చే ఒక్క మంచి పనైనా చేశారా?'' అంటూ ట్విట్టర్ వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Also Read : జనంలోకి TRS యువనేత.. సామాజిక సేవలో తనదైన ముద్ర