YS Vijayamma ఆమరణ నిరాహార దీక్ష!

by GSrikanth |   ( Updated:2022-11-29 10:54:31.0  )
YS Vijayamma ఆమరణ నిరాహార దీక్ష!
X

దిశ, డైనమిక్ బ్యూరో: అరెస్ట్ అయి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఉన్న వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిలను చూసేందుకు బయలుదేరిన వైఎస్ విజయమ్మను పోలీసులు అడ్డుకున్నారు. బయటకు రాకుండా లోటస్ పాండ్ ఇంట్లోనే విజయమ్మను పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఈ క్రమంలో పోలీసుల తీరుపై విజయమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను తన కూతురుని చూసేందుకు ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ వెళ్తున్నానని అనుమానం ఉంటే తన కార్‌లోనే పోలీసులను కూడా పంపాలని విజయమ్మ అన్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో అక్కడికి వవెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో పోలీసులపై ఆమె మండిపడ్డారు. తాము కూడా ప్రభుత్వాలను నడిపామని, పోలీసులను చూశామని ఇదేం తీరు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరు ఇలానే ఉంటే రాష్ట్రమంతటా బంద్‌లు, నిరసనలు, గొడవలకు పిలుపునివ్వాల్సి ఉంటుందని హెచ్చరించారు. అయినా పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో విజయమ్మ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. దీంతో పరిస్థితి టెన్షన్‌గా మారింది.

Read more:

YS షర్మిల అరెస్ట్.. SR నగర్ పీఎస్‌కు ఏపీ సీఎం జగన్!

ఎస్‌ఆర్ నగర్ పీఎస్ వద్ద ఉద్రిక్తత.. పంజాగుట్ట పీఎస్‌లో YS Sharmila పై కేసు

Advertisement

Next Story