- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎక్కడపడితే అక్కడ చేతులు వేశారు.. పోలీసులపై YS విజయమ్మ ఫైర్
దిశ, తెలంగాణ బ్యూరో: తమ ఇంటి చుట్టూ పోలీసులు టెర్రరిస్టులా మోహరించారని వైఎస్ విజయమ్మ విమర్శలు చేశారు. లోటస్ పాండ్‌లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిలను అరెస్ట్ చేయడంపై విజయమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. షర్మిలను చూసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్తుండగా పోలీసులు విజయమ్మను అనుమతించకపోవడంపై మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం షర్మిలను ఎందుకు అడ్డుకుంటోందని ఆమె ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఏకైక వ్యక్తి షర్మిల అని, అందుకే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రతి సారి హౌజ్ అరెస్టులతో అణచివేస్తున్నారని ఘాటుగా స్పందించారు.
టీఎస్ పీఎస్సీ లీకేజీపై ఒంటరిగా సిట్ అధికారులకు వెళ్లి ఫిర్యాదు చేయాలనుకుని బయలుదేరితే అరెస్టులు చేస్తారా? అని ఆమె ఫైరయ్యారు. గ్రూప్స్ పరీక్ష పేపర్లు, పదో తరగతి పేపర్లు లీకేజీ ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని ఆమె ధ్వజమెత్తారు. పోలీస్ స్టేషన్‌లో ఉన్న తన కూతురిని చూసేందుకు కూడా పోలీసులు అనుమతించట్లేదని మండిపడ్డారు. షర్మిలను ఎందుకు అరెస్ట్ చేశారని పోలీసులను అడిగితే సమాధానం చెప్పడంలేదన్నారు. నిరుద్యోగుల సమస్యలపై మొదట పోరాటం చేసింది షర్మిలనే అని ఆమె గుర్తుచేశారు. పోలీసులు షర్మిల వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్నారని విజయమ్మ ఆగ్రహం వ్యక్తంచేశారు.
ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదా? అని నిలదీశారు. ఒక మహిళపై కనీస గౌరవం లేకుండా అంతమంది పోలీసులు పైన పడితే ఆవేశం రాదా అని విజయమ్మ మండిపడ్డారు. పది మంది మహిళా పోలీసులు తనపై పడుతూ, ఎక్కడపడితే అక్కడ చేతులు వేస్తూ కార్లో ఎక్కించబోయారని, అందుకే తనకు ఆవేశం వచ్చిందని విజయమ్మ చెప్పారు. పోలీసులు షర్మిల డ్రైవర్‌ను, గన్ మెన్లను కొట్టారని, వారలా ఎందుకు వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. ఈ విషయంపై కోర్డును ఆశ్రయిస్తామని విజయమ్మ తెలిపారు.
Also Read..
గాడిదలు కాయాలని పోలీసులకు సూచించిన షర్మిల.. ‘ఓకే మేడం’ అంటూ షాకింగ్ రిప్లై